రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నూతన సీఈవో యోగేష్ పైతాంకర్ ప్రాజెక్ట్ పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ పురోగతి, కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. పోలవరం పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి కావాలన్న దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.



















