ఐతే 5,000 ఏళ్ల చరిత్ర కలిగిన భారత పట్టు, ఒకప్పుడు ప్రపంచానికి వస్త్ర నాగరికత నేర్పింది. అయితే ఇప్పుడు చైనా, జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఆధునిక పారిశ్రామిక యూనిట్లలో, 5 వేల మగ్గాలను ఒక్క AI నెట్‌వర్క్ ఒకే సెంట్రల్ సర్వర్ ద్వారా నియంత్రిస్తోంది. రోబోటిక్ చేతులు, స్వయంప్రతిపత్త వాహనాలు, సెన్సార్లు కలసి ‘జీరో డిఫెక్ట్’ ఉత్పత్తిని సృష్టిస్తాయి.మనం వాస్తవానికి ఒకప్పుడు మన నైపుణ్యంపై గర్వపడేవాళ్లం, కానీ ఇప్పుడు AI ఆధారిత తక్కువ ఖర్చు, అధిక వేగం ఉన్న వస్త్ర ఉత్పత్తి ప్రపంచాన్ని నియంత్రిస్తోంది. మన చేనేత కళను కాపాడుకోవాలంటే, తక్షణమే రోబోటిక్ ఏఐను వినియోగ మార్కెట్లో కలిపి, నాణ్యతతో పాటు సమర్థత పెంచుకోవాల్సిన అవసరం ఉంది.



















