అగ్రనాయకులు చిరంజీవి, వెంకటేశ్ ప్రేక్షకులను “ఆర్ యూ రెడీ” అని అలరించడానికి సిద్దమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. వెంకటేశ్ అతిథి పాత్రలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా రిలీజ్ అవుతుంది. ప్రీ-ప్రచారంలో భాగంగా “ఆర్ యూ రెడీ” పాట ప్రోమో (Mega Victory Mass Song)ను ఇటీవల విడుదల చేశారు. పూర్తి పాట డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.




















