జపాన్‌లో కొత్త ఏడాది సెలవుల సందర్భంగా కాన్-ఎట్సు ఎక్స్‌ప్రెస్ రోడ్డుపై సుమారు 50 వాహనాలు ఒకదానిపై ఒకటి ఢీ కొట్టాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో మంటలు చెలరేగి కొన్ని వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 7 గంటలపాటు కృషి చేసి మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కువ మంచు కురిసే కారణంగా గొలుసుకట్టు ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నారని తెలిపారు.




















