ప్రభాస్ (Prabhas) కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా విడుదలవుతుందంటే ఇండస్ట్రీ మొత్తం సందడిగా మారుతుంది. త్వరలో ‘ది రాజాసాబ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్ సినిమా ప్రచారంలో భాగంగా చిత్రబృందం ఒక ప్రత్యేక మ్యాష్‌అప్ వీడియోను విడుదల చేసింది. ప్రభాస్ కెరీర్ ఆరంభం నుంచి ఆయన సినిమాల విడుదల సమయంలో అభిమానులు చేసిన హంగామా, అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆయనపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. గతంలో అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ చెప్పిన మాటలు భావోద్వేగంగా ఆకట్టుకుంటాయి. తనకు ఒక్క అభిమాని ఉన్నా చాలని భావించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని ఆయన చెప్పడం అందరినీ కదిలిస్తుంది. ఆ భావోద్వేగాలతో నిండిన వీడియోను మీరు కూడా తప్పకుండా చూసేయండి.




















