విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనపై సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా వేయగా, మూడోసారి క్రాస్-ఎగ్జామినేషన్ కు లాయర్లతో హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్-ఎగ్జామినేషన్ పూర్తయ్యాయి. సాక్షి పత్రిక 2019 అక్టోబర్ 22న ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ శీర్షికతో అసత్య కథనం ప్రచురించిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.



















