హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది.సంక్రాంతి పండగ కోసం సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ హైవే కిక్కిరిసిపోయింది. శనివారం ఉదయం నుంచి హైవేపై దారిపొడవుగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ మరింత పెరిగింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.


















