ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి మహాశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలో ఉత్సాహంగా డ్రమ్ములు వాయించారు. ఈ సందర్భంగా అక్కడున్న భక్తులు, స్థానికులు ఆనందోత్సాహాలతో తిలకించారు. ప్రధాని మోదీ భక్తి భావం, ఉల్లాసం కలగలిసిన ఈ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.




















