ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశారు. మనమంతా ఒక టీమ్‌లా కృషి చేస్తే అసాధ్యమైన మార్పులు కూడా సాధ్యమని ఇప్పటికే నిరూపించామని అన్నారు. గతంలో ఎదురైన ఆటంకాలను దశలవారీగా సరిచేస్తూ, అనేక సవాళ్లను అధిగమించి రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి మార్గంలోకి తీసుకొచ్చామని చెప్పారు. 2025 సంవత్సరం రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో విజయవంతంగా గడిచిందని పేర్కొన్నారు. అయితే ఇది కేవలం ఆరంభమేనని, రాబోయే రోజుల్లో మరింత వేగంగా ప్రగతి సాధిస్తామని తెలిపారు. ఈ ప్రయాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని, అప్పుడే రాష్ట్రం మరిన్ని గొప్ప విజయాలు అందుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.



















