బెంగుళూరు–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఉమ్మడి విజయాన్ని మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో కలిసి వర్చువల్‌గా భాగస్వామ్యం చేసుకున్నామని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో ఈ ఘనత సాధించామని పేర్కొన్నారు. అత్యంత వేగంగా 6 లేన్ల జాతీయ రహదారిని నిర్మించి రికార్డు నెలకొల్పిన రాజ్ పథ్ ఇన్‌ఫ్రా కామ్ సంస్థను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. జనవరి 6 నుంచి 11 వరకు నిరంతరాయంగా 10,655 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్ వేసి, 52 కిలోమీటర్ల 6 లేన్ రహదారి, 84.4 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి నిర్మాణంతో ప్రపంచ రికార్డులు సాధించారని తెలిపారు. అమరావతి–బెంగుళూరు నేరుగా రహదారి నిర్మాణానికి ‘అమరావతి–బెంగుళూరు రోడ్’గా నామకరణం చేయాలని కోరుతూ, ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ సీఎం హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


















