‘బలగం’ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న హాస్యనటుడు వేణు యెల్దండి, ఇప్పుడు ‘ఎల్లమ్మ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న రెండో సినిమా ఇదే. ఈ చిత్రంతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతూ, డప్పు కళాకారుడు పర్షి పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



















