దావోస్ – దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా పాల్గొంటున్నారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు భారతీయ, అంతర్జాతీయ పరిశ్రమల నాయకులతో వరుస కీలక సమావేశాలు నిర్వహిస్తూ, సాంకేతిక రంగం, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా, భవిష్యత్తు వృద్ధికి సిద్ధమైన గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా ఈ సమావేశాలు కీలకంగా మారుతున్నాయని అధికారులు తెలిపారు.


















