దేశ అభివృద్ధి స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగించే ముఖ్యమైన ప్రమాణమే మానవ అభివృద్ధి సూచిక . ఇది కేవలం ఆర్థిక వృద్ధినే కాకుండా, మానవ శ్రేయస్సు, జీవన నాణ్యత వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తుంది. ప్రజల ఆరోగ్యం, విద్యా స్థాయి, జీవన ప్రమాణాల సగటును ప్రతిబింబించే ఈ సూచిక, దేశానికి అసలైన సంపద ప్రజలేనని స్పష్టంగా తెలియజేస్తుంది.
ఈ సూచిక యొక్క ప్రాముఖ్యత, లెక్కింపు విధానం వంటి అంశాలపై పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలి. అలాగే, భారతదేశ స్థాయి, స్థానం మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధాన మార్పులు, ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లు వంటి అంశాలను కూడా తెలుసుకోవడం అవసరం.




















