డైపర్స్ అనగానే ఠక్కున పిల్లలు గుర్తుకొస్తారు. అయితే, పెద్దలకూ అడల్ట్ డైపర్లున్నాయి. ఆరోగ్య సమస్యలున్నవారు, కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇవి చాలా అవసరం. అయితే వాటి ఎంపిక, వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా రకాలు…
- పెద్దల ఫుల్ అప్ డైపర్లు సాధారణంగా లోదుస్తులను పోలి ఉంటాయి.
- టైప్ స్టైల్ తరహాలో ఉండే టేప్ ఫ్యాషన్ డైపర్లు, ట్యాబ్-స్టైల్ బ్రీఫ్ తరహాలో డైపర్లు సంరక్షకులపై ఆధారపడిన వారికి ఉపయోగంగా ఉంటాయి.
- రాత్రిపూట వినియోగించే ప్రత్యేక డైపర్లు, క్లాత్ డైపర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎంపికలో జాగ్రత్తలు..
- పెద్దల డైపర్లు కొనే ముందు తగిన స్థాయిలో శోషణ సామర్థ్యం ఉందా.. లేదా.. చూసుకుని ఎంచుకోవాలి.
- కంఫర్ట్ చాలా అవసరం. చర్మపు చికాకును నివారించేలా, రోజంతా మృదువుగా ఉండేవి చూసుకోవాలి.
- చాలా బిగుతుగా లేదా మరీ వదులుగా లేకుండా చక్కగా సరిపోయేవి ఎంపిక చేసుకోవాలి.
- అలర్జీలు రాకుండా ఉండే వాటిని చూడాలి. హైపో అలెర్జెనిక్, సువాసన లేని వాటిని ఎంచుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చు.
- టేప్ తరహా డైపర్లు మంచం మీద ఉన్న వారికి, కదలికలు తక్కువగా ఉండే వృద్ధులకు అనువైనవి. ప్యాంటు తరహా డైపర్లు మిగిలినవారికి అనుకూలంగా ఉంటాయి.
- పెద్దల డైపర్లను ప్రతి 4 నుంచి 6 గంటలకు ఒకసారి మార్చడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
- అవి మురికిగా ఉన్నప్పుడు తొలగించాలి. లేకుంటే చర్మంపై దద్దుర్లు, దుర్వాసన, ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది.
- అధిక శోషణ శక్తి, లీక్‌గార్డులు, దుర్వాసన నియంత్రించే లక్షణం, మృదువుగా ఉండటం, గాలినీ పీల్చుకునే పదార్థాలు కలిగి ఉండటాన్ని చూడాలి.



















