“తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం సేవలు ప్రారంభమయ్యాయి. శ్రీవారి ఆలయ సేవలు మరియు పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం, భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశమని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ కేంద్రాన్ని దాతల సహకారంతో అందుబాటులోకి తేవడం జరిగింది.”




















