హైదరాబాద్: నటుడు అల్లు శిరీష్ త్వరలో వివాహ జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన జీవిత భాగస్వామిగా నయనికను ఎంచుకున్నారు. ఈ జంట నిశ్చితార్థ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు మరియు సన్నిహిత మిత్రుల సమక్షంలో శిరీష్-నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్‌చరణ్, వరుణ్ తేజ్ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరై వేడుకకు మరింత శోభను చేకూర్చారు.
ఈ నిశ్చితార్థ వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.




















