మండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఎమ్మెల్సీ జయమంగళ్ వెంకటరమణ కలిశారు. తన రాజీనామాను ఆమోదించడంలో ఆలస్యం జరిగిందని హైదరాబాద్ హైకోర్టును ఇటీవల వెంకటరమణ ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, రాజీనామాపై నాలుగు వారాల్లో నిర్ణయం ప్రకటించాలని ఆదేశించింది. ఈ మేరకు, హైకోర్టు కాపీ ఆయన మండలి ఛైర్మన్‌కి అందజేయబడింది. ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాలు మండలి ఛైర్మన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.



















