ఏపీ రైతులకు సంతోషకరమైన వార్త. ఈ నెల 19న ‘అన్నదాత సుఖీభవ్’ ప్రోగ్రాం కింద రెండో విడత నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను విడుదల చేయనున్నారు. అదే రోజు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేయనుంది. కేంద్రం నుంచి రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5,000 కలిపి మొత్తం రూ.7,000 ప్రతి రైతు ఖాతాలో జమ కానుంది. రెండో విడతలో మొత్తం 46 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.



















