ఇంటర్నెట్ డెస్క్: హీరో మోటోకార్ప్ తన విడా బ్రాండ్ ద్వారా విద్యుత్ వాహన రంగంలో మరొక అడుగు వేస్తోంది. త్వరలో కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. ఈ బైక్‌ను ఇటలీ మిలాన్‌లో నవంబర్ 6 నుంచి 9 వరకు జరగనున్న ప్రపంచ ప్రసిద్ధ ఆటో ఎగ్జిబిషన్ EICMA 2025లో ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ తాజాగా ‘ప్రాజెక్ట్ VXZ’ పేరుతో టీజర్‌ను విడుదల చేసింది.
టీజర్‌లో పూర్తి డిజైన్ బయటపడకపోయినా, స్పోర్టీ లుక్‌తో బైక్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. షార్ప్ హెడ్‌ల్యాంప్, స్టైలిష్ టెయిల్‌ల్యాంప్, స్ప్లిట్ సీటు, వెడల్పాటి హ్యాండిల్‌బార్ వంటి అంశాలు కనిపించాయి. “Vida” పేరుతో స్ఫూర్తి పొందినట్లుగా ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లైట్లను హెడ్‌ల్యాంప్ పక్కన అమర్చారు.
ఈ బైక్ యొక్క బ్యాటరీ సామర్థ్యం, గ్రాఫిక్స్, ఫీచర్లు వంటి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. సాధారణంగా EICMA వేదికగా ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు తమ రాబోయే మోడళ్లను ప్రదర్శిస్తాయి. ఈసారి హీరోతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్ వంటి కంపెనీలు కూడా తమ కొత్త మోడళ్లను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యాయి.




















