తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులకు డ్రాయింగ్ పుస్తకాలు, ఆట వస్తువులు, పండ్లు పంపిణీ చేసి వారి మనోధైర్యాన్ని పెంచారు. ఈ సేవా కార్యక్రమం పలువురి హృదయాలను కదిలించింది.


















