విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు బలహీన వర్గాలు కాదని, సామాజికంగా, ఆర్థికంగా బలమైన వర్గమని పేర్కొన్నారు.
బీసీల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో పార్టీ అనేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. రిజర్వేషన్ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బీజేపీ ఎప్పుడూ బీసీలకు అత్యంత చేరువగా ఉండే పార్టీగా నిలిచిందని, భవిష్యత్తులో కూడా బీసీ వర్గాల అభివృద్ధి కోసం తమతో కలిసి నడుస్తుందని మాధవ్ గారు స్పష్టం చేశారు.
“సమాజంలో సమానత్వం, అవకాశాలు అందరికీ కల్పించాలనే దిశగా బీజేపీ కట్టుబడి ఉంది. బీసీలకు ఆత్మవిశ్వాసం నింపే విధంగా మేం కృషి చేస్తున్నాం,” అని ఆయన తెలిపారు.




















