రవితేజ సంక్రాంతి బరిలో భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో సందడి చేయనున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ముగింపు దశలో ఉంది.
సోమవారం ఈ సినిమా నుంచి తొలి గీతాన్ని విడుదల చేశారు. “బెల్లా బెల్లా.. ఈసా బెల్లా.. బాగున్నావే రసగుల్లా” అనే రొమాంటిక్ పాటకు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా, సురేశ్ గంగుల సాహిత్యం అందించారు. నకాష్ అజీజ్, రోహిణి ఆలపించిన ఈ గీతలో రవితేజ – ఆషికా మధ్యని కెమిస్ట్రీ, హుషారైన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నటి ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ: “మంచి వినోదంతో నిండిన కుటుంబ కథా చిత్రమిది. నా పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది.”
నటి డింపుల్ హయాతి: “నేను బాలమణి పాత్రలో నటిస్తున్నా. మాస్ మహారాజా ఎనర్జీ ఎలా ఉంటుందో సంక్రాంతి ప్రేక్షకులు చూడగలరు.”
చిత్రానికి కూర్పు: శ్రీకర్ ప్రసాద్, ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల.



















