మొదటి భాగం 2/25
1895 లో, వెంకట్రామన్ ఐదవ ఫారమ్ చదువుతున్నాడు.ఒక రోజున ‘రామస్వామి అయ్యర్ ” అనే తిరుచ్చుళి గ్రామ వానియాత్రలు చేసి, తిరిగి స్వగ్రామం వెడుతూ, మధురలో వెంకట్రామన్ కికనుపించాడు. ఆయన్ని చూసి, “మీరు ఎక్కనుంచి వస్తున్నారు?”అని వెంత ట్రామన్ అడిగాడు. దానికి ఆయన “అరుణాచలంనుంచి అన్నారు. “అరుణాచలం” అనే మాట వినగానే, వెంకట్రామన్ఆనందపారవశ్యంలో మునిగి పోయాడు.
అరుణాచల మనే మాట వెంకట్రామన్ హృదయాంతరాళంలో ఒక వెలుగు రవ్వ మాదిరిగా తళుక్కున మెరవడంతో,ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆవేశాన్ని ఆపుకోలేక ఆతృతగా”అరుణాచలం ఎక్కడ ఉంది?” అని అడిగాడు. వెంకట్రామన్ఆశ్చర్యానికి, అమాయకత్వానికి, ఆతృతకీ ఆనందపడి, “తెలియదా?తిరువణామలై పేరు వినలేదా? అదే అరుణాచలం” అన్నారాయన.“అరుణాచలం’ అనే మాట వెంకట్రామన్ లేత హృదయాన్నిసూటిగా, వాడిగా తాకింది. కాని, అతనికి అరుణాచలం యొక్కగొప్పతనం కాని, దాని అర్థం కాని, దాని అంతరార్థం కాని, దాని26
స్వరూపస్వభావాలు కాని.. ఏమీ తెలియవు. కాని, అరుణాచలమనేమాట అతని మనసులో పదే పదేస్ఫురణకు వచ్చింది. తనకూ, అరుణాచలానికి గల సంబంధమేమిటో అతనికి ఏమీ తెలియదు. కాని,”అరుణాచలం” అనే మాట విన్నప్పటినుంచి, వెంత ట్రామన్మనసులో ఆ మాట ప్రజ్వలిస్తో, ప్రకాశిస్తో ప్రతిధ్వనించింది. ఆ నాటిసంగతిని భగవాన్ ఇట్లా .3కొ వర్ణించి చెప్పారు:
“అరుణాచలం అచలంగా వుంది. అది ఆదికాలం నుంచీ నాలో
నిగూఢ గా వుండి, ప్రకాశిస్తోనే వుంది. నేను దాని గురించి మరొకరిద్వారా విన్నప్పుడు, అదే ‘తిరువణామలై” అన్నప్పుడు కూడా,నేను దాని అర్థాన్ని, ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయాను. కాని,త్వరలో అరుణాచలం నన్ను తన దగ్గరకు తీసుకున్న తర్వాత, నామనసు నిశ్చలమైపోవడం చేత, నేను దాన్ని మరింత సన్నిహితంగాసమీపించి, దర్శించి, అది అచలంగా ఉండటం గమనించాను.”
అప్పటివరకు వెంఠట్రామన్ కి అరుణాచలమనే పుణ్యక్షేత్రమొకటి ఉందని కూడా తెలియదు. ఆ క్షణం నుంచి “అరుణాచల
మనే మాట అతనికి ఒక మంత్రంగా, దీక్షగా మారిపోయింది. ఆస్ఫురణే, అతని జీవితాన్నంతా వెలిగించింది.
కొన్ని రోజుల తర్వాత ఒకాయన సుబ్బయ్యర్ దగ్గరకు వచ్చి“పెరియ పురాణం’ ఇచ్చి, చదపమన్నారు. అది అనేకమందిమహాత్ములైన నాయనారుల జీవిత గాథలతో కూడిన గ్రంథం. ఆనాయనారులందరూ, శివభక్తులు. ఆ గ్రంథాన్ని వెంకట్రామన్కూడా చదివాడు. ఆ మహాత్ముల వైరాగ్యం, బ్రహ్మైక్యం అతన్నిఎంతగానో ఉత్తేజపరిచాయి. అతన్ని గట్టిగా ఆలోచింపజేశాయి,సర్వసంగపరిత్యాగం ద్వారా ఈశ్వరునిలో ఐత్యం కావడమనే27
సంగతిని, ఆ గ్రంథం వ్యక్తపరచింది. ఆ గ్రంథం, అతనిలో భ క్తిభావాన్ని రగిల్చింది.
ఆ మహాత్ముల యెడ భక్తి, గౌరవం ఏర్పడ్డాయి. పెరియపురాణం చదపడంవల్ల, వెంకట్రామన్ లో ఏదో అర్థం కానిగొప్పఅనుభూతి కలిగింది. ఆ మహాత్ములులు చూపిన భ క్తి, విశ్వాసం, ప్రేమ,దైవచింతన తనకూ సాధ్యమనుకున్నాడు, వెంఠట్రామన్. అలాగే,జీవితంలో ఎంతో అందం, ఆనందం ఉన్నాయని గ్రహించాడు.
ఆ రోజుల్లో వెంకట్రామస్ తరచు మీనాక్షి ఆలయానికివెళ్లేవాడు. ఆలయానికి వెళ్ళగానే, అతని ఒళ్లు పెద్ద జ్వరం వచ్చినంత వేడిగా ఉండేది. అయినా అతను దేవి మీనాక్షి సమక్షంలోఆనందపారవశ్యంలో ఉండేవాడు.


















