మొదటి భాగం 3/25
1896లో నాగస్వామికి పెళ్ళయింది. అతని అత్తవారిఊరు కూడా మధురే. ఆ సంవత్సరం వెంకట్రామస్ మెట్రిక్యులేషన్పరీక్షకు చదువుతున్నాడు. కాని, అతన్ని అప్పటికే అరుణాచలంగట్టిగా ఆకర్షించి, వశం చేసుకుంది.
ఆ సంవత్సరం జూలై నెల మధ్యలో ఒకరోజున వెంకట్రామన్మేడమీద గదిలో పడుకుని వుండగా, అకస్మాత్తుగా అతనికి ఒకఅనుభవం కలిగింది. “నేను చనిపోతున్నాను. నేమ చనిపోతాను”అని. ఆ సంగతి అతనికి నిష్కారణంగా అనిపించింది. అలా అనిపించి, చివరికి అది ఒక అనుభవంగా మారింది. ఆ అనుభవాన్నిభగవాన్ ఇట్లా చెప్పారు:
“నా జీవితం గొప్ప మలుపు తిరిగే ఆరు వారాల ముందు,ఒక రోజు మధ్యాహ్న వేళ, నేను మా చిన్నాన్న గారి డాబా మీదిగదిలో పడుకున్నాను. నా ఆరోగ్యము బావుంది. మెలకువగానేవున్నాను. కాని, నిషారణంగా ‘నేను చనిపోతున్నాను. నేనుచనిపోతాను” అని పదేపదే ఆ నిపించింది. అలా ఎందుకు అనిపించిందో తెలుసుకోవాలని ప్రయత్నించడానికి కూడా వ్యవధి లేనంతఅకస్మాత్తుగా అనిపించింది.
“అయితే, ఇప్పుడు నేనేం చెయ్యాలి?” అని యోచించాను.ఎంత ఆలోచించినా ఏమీ తోచలేదు. డాబాదిగి, ఆ విషయం పెద్దలతోగాని, బంధు మిత్రులతో గాని, డాక్టరుతో గాని చెప్పి, వారిసలహా, సహాయం తీసుకోవాలని కూడా అనిపించ లేదు. ఏమైనా ఆసంగతి నాకు నేనే, అప్పటికప్పుడే, పరిష్కరించు కోవాలనుకున్నాను.
ఆ మృత్యు తాకిడి, క్రమంగా నా మనసుపై పనిచేసింది.దానితో మనసు అంతర్ముఖమైంది. ఆ నా స్థితి గమనించి నాలోనేననుకున్నాను, “ఇప్పుడు నాకు మృత్యువు సమీపించింది. మృత్యు వంటే ఏమిటి? చనిపోయేదెవరు? ఈ దేహం చనిపోతుంది. అయితేదేహంతోపాటు నేను చనిపోతానా? నేనూ దేహమైతే, చనిపోతాను.నేను దేహం కాకపోతే చనిపోను” అని అనుకుని. తక్షణం ఆమృత్యు సంభవాన్ని అనుసరించి, శరీర అవయవాలన్నింటినీ బిగపట్టి,బిర్రబిగుసుకుని, వెల్లకిలా శవం మాదిరిగా నేల మీద పడుకుని,దాన్ని మరింత వాస్తవం చేశాను. శ్వాస ఆపాను. నోరు మూశాను.లోపల్నుంచి ఏ శబ్దమూ చివరికి “నేను’ అనే ఆలోచన కూడాకలగచుండా, మనసును సహితం నిలిపేసి “ఇప్పుడు ఈ దేహంచనిపోయింది. దీన్ని స్మశానానికి మోసుకుపోయి దహనం చేస్తారు.అది కాలి, బూడిద అవుతుంది. కాని, “నేను” అనేది మాత్రం,దేహంతో పాటు చావక మిగిలివుంటుంది.
“నేను” అనేది శరీరం కాదు గనుక, అది దేహంతో పాటుచావదు, నాశనం కాదు,” అనే భావం నాలో స్థిరపడింది. నాలోమనోవృత్తులు నాశనం కాలేదు. “నేను” అనే స్మృతి మిగిలేవుంది.దానితోపాటు వ్యక్తిత్వపు స్ఫురణ వుంది. లోపలా బైటా అన్నిసంగతులు ఎప్పటి మాదిరిగా నాకు తెలుస్తూనే వున్నాయి. సర్వమూనాకు స్పష్టంగా స్ఫురిస్తోంది. కాని, నా దేహం మాత్రం అచేతనంగా,నిశ్శబ్దంగా, జడం మాదిరిగావుంది. అంత స్పష్టంగా అన్ని సంగతులూతెలుస్తోవుంటే, ఇంక ఇదేం చావు? అనిపించింది.
“నేను వున్నాను” అనే స్ఫురణ నాకు సంభవించిన మృత్యువుకు భిన్నంగా, అన్యంగా, విడిగా, దూరంగా ఉంది. నేనున్నాననేస్ఫురణనాలో అవిచ్ఛిన్నంగా ఉండడంతో, “నేను” అనేది దేహాన్నిమించిన చిద్వస్తువుగా గోచరించింది. మరణించేదిదేహం కాని,”నేను’ కాదు అనే సంగతి, క్షణకాలంలో మెరపులాగ రూఢమైంది.ఆ చిద్వస్తువే, సద్వస్తువు. అది నాశనం కానిది. మృత్యువు దానిఛాయలకే రాలేదు.
“ఆ నేను” అనేది నాలో జ్ఞానంతో జ్వలిస్తోవుంటే, దేహంజ్ఞానరహితంగా పడివుంది. అదంతా నా మందబుద్ధి ఆలోచన మాత్రంకాదు. అది ఒక ఆలోచనా ఫలితమూ కాదు. అది ఒక అనుభవం.నేను సూటిగా దర్శించిన సత్యమది. అది నాలో అంత స్పష్టంగాగోచరమైన సంగతి.
‘నేను వున్నాను” అనేది ఒక్కటే చిద్వస్తువుగా, అసలుసత్యంగా, వాస్తవంగా తోచింది. నా మనో దేహ కదలికల అన్నింటికీ ఆ నేనే కేంద్రం అనిపించింది. ఆ క్షణం నుంచి ఆ “నేను” చాలాశ క్తివంతంగా, తన మీద తానే దృష్టి నిలిపింది. ఆ దృష్టి క్రమంగాఏకాగ్రమైంది. తత్ఫలితంగా అంతకుముందు నాకు కలిగిన మృత్యుభీతి, అదృశ్యమైంది. కాని, అనేక ఇతర ఆలోచనలు సంగీత స్వరాలుమాదిరిగా, నాలో వస్తూ పోతూనే వున్నాయి. ‘నేను” అనేదిప్రధాన శృతి వలె, వాటి వెంట సాగుతూవుంది. దేహం, దేంట్లోలీనమైనా – అంటే, పనుల్లో – మాటల్లో మననంలో పఠనంలో,ఏ వృత్తిలో లీనమైనా, దానికి ‘నేనే కేంద్రమన్న సంగతి ఆక్షణాన నాకు స్పష్టంగా తెలిసింది. అది ఊహాతీతమైన సంగతి. ఆక్షణాన నాలో ఏదో ఒక వింత శక్తి ఆవిర్భవించింది.ఆసక్తిمనన్నూ, నా మనసునూ, నా జీవితాన్ని పూర్తిగా తీసుకుని వశపరచుకుంది. ఆ శక్తి ప్రభావం వల్ల నేను పునర్జన్మ ఎత్తినట్లు అని పించింది. నేను ఒక కొత్త మనిషిగా మారాను. నాలో ద్వంద్వ భావంనశించింది. ఆ తర్వాత అన్నింటి మీదా ఇష్టాలు పోయి, ఉపేక్షాభావం, ఉదాసీనం ఏర్పడ్డాయి.
“ఆ అనుభవం, నేను కోరుకున్నది కాదు. ఆ స్థితి, నేనుప్రయత్నించి తెచ్చుకున్నది కాదు. ఆ జ్ఞానాన్ని, నేను తెలుసుకోవాలని వాంఛించలేదు. ఆ సత్యాన్ని, దర్శించాలనే కుతూహలం నాలోలేదు. దానికి నేను ఆకర్షితుడనూ కాలేదు. దానిమీద నాకు ప్రత్యేక ఆసక్తి లేదు. దేన్నోపొందాలనే కోర్కె నాకు ఎప్పుడూ లేదు. అప్పటికినాకు ఆత్మ విషయమై ఒక నిర్దిష్టమైన, స్థిరమైన, స్పష్టమైన అభిప్రాయం గాని, దృష్టి గాని, ఆలోచన గాని ఏమీ లేదు. కాని, ఆసంఘటన అలా జరిగిపోయింది. దైవిక శక్తి నన్ను ఆక్రమించి,అకస్మాత్తుగా నాలో గొప్ప మార్పు తెచ్చింది. పెద్ద గాలిదుమారం,చిన్న ఇసుక రేణువును ఊడ్చేసినట్లు, ఆ మృత్యు అనుభవం, నన్నుఅరుణాచలం చేర్చింది.
****ఆ తర్వాత, వేదాంత గ్రంథాలు చదివాను. వాటిల్లో ఆత్మగురించి ఏం రాశారో, అదే నా అనుభవమని గురించాను.****
ఆ అనుభవంతో వెంకట్రామన్ దేహాత్మ భావం పోయింది.మృత్యు ఖీతి శాశ్వతంగా తొలగింది. శాశ్వత సత్యమైన “నేనుఅనే దానికి పూర్తి ఎరుకలో నిలిచిపోయాడు వెంకట్రామన్.
ఆస్థితి జాగ్రత్ సుషుప్తి – స్వప్నం వంటి స్థితి కాదు.తి కాలానికి కట్టుబడేది కాదు! కాని, అది ఎవరికిగాని కొత్తగాకలిగే స్థితితి కాదు. అది సహజ స్థితి.. అవిద్య వల్ల, సామాన్యులుఆ స్థితిని గుర్తించరు. “అవిద్యను రూపుమాపితే, స్వయం ప్రకాశమైనఆ “అసలు నేను “ను స్వరూపంగా దర్శించవచ్చు. అదే మోక్షంఅన్నారు భగవాన్ ఒకసారి.
మృత్యు భీతి కలగడంలో ఆశ్చర్యం లేదు. అది సహజం.కాని, వెంకట్రామన్ తనకు కలిగిన మృత్యు అనుభవాన్ని వదలక,గట్టిగా పట్టుకుని, దాని అసలు సంగతి తేల్చుకోవాలని తీవ్రంగా,శ్రద్ధగా, నిజంగా శక్తినీ, మేధస్సునీ, బుద్ధినీ కేంద్రీకరింపజేసిఅన్వేషింప నారంభించేప్పటికి, దాని అసలు సంగతి బైటపడింది.32
ఆ క్షణంలో అతని కేంద్రీకృతి శక్తి, అన్వేషణాపటిమ, మృత్యుపరిధినే దాటి, పనిచేసింది. అది అలా పని చేయడమే, ఒక గొప్పసంగతి. తత్ఫలితంగా అతనిలో దేహాత్మ భావం తొలగింది. అతనుఏ విధమైన యోగసాధనా చేయకుండా, ఆధ్యాత్మికోన్నత స్థితినిఅందుకున్నాడు.
వెంకట్రామన్ కు కలిగిన అనుభవం, మామూలు మనుష్యులకుఅర్ధం కావడం బహు కష్టం. ఎందుకంటే, అతనికి కలిగిన అనుభవంతో పోల్చి చూసుకోవడానికి, కనీసం తమకు కూడా అటువంటిఅనుభవమేదో కలిగివుండాలి కదా? అంతటి అనుభవం కలిగినవారే,అతని స్థితిని అర్ధం చేసుకోగలరు.
అనుభవం – అవగాహన – ఆత్మ సాక్షాత్కారం. మోతం నిర్వాణం. దాన్ని ఏ పేరుతోనైనా పిలవండి. అదే అసలు సత్యం.దాన్ని పొందడానికి ఎంతటివారికైనా కొంతకాలం పడుతుంది. అదిఎంతకాలమని కాదు. వెయ్యేళ్లు కావచ్చు. క్షణకాలం కావచ్చు.మొగ్గ పూర్తిగా విచ్చు కోవడానికి కొంతకాలం పట్టినట్లే, మనోవికాసానికి కొంత కాలం పడుతుంది. అలా కాకుండా ఏదో మహిమగా,చిత్రంగా, అకాలంగా ఏ మొగ్గా విచ్చుకోదు. కాని, కొన్ని సంఘటనలు అకస్మాత్తుగా, బహు చిత్రంగా జరిగినట్లు అనిపించినా,వాస్తవానికి అవితీసుకోవలసిన కాలం, అవి ఎట్లానూ తీసుకుంటాయి.ఆ తర్వాత అన్ని పువ్వులు మాదిరిగా, అవీ పరిమళాన్ని విర జిమ్మిక్రమంగా ఎండి, వాడి, రాలిపోతాయి. అది ప్రకృతి సహజం.
జీవితమంతా సాధన చేసి సాధింప శత్యం కానిది, వెంత ట్రామన్ కి అరగంటకాలంలో అత్యంత సులభంగా లభ్యమైంది. ఆఅనుభవంతో, అతనికి కాలమే ఆగిపోయింది. అతని శారీరక -మానసిక స్థితి, చచ్చి – బ్రతికినట్లుఉంది. దేహం, అదే కాని, అందుపూర్వం మనసు లేదు. కాని, మనసు వుంది. అది కాలిన తాడు
మాదిరిగా వుంది. కాంతికి విచ్చుకున్న మొగ్గ మాదిరిగా, అతనుప్రపంచాన్ని పరికించాడు. అతనిలో ద్వంద్వ ప్రవృత్తి నశించింది.తిరిగి అతనికి పసితనం వచ్చింది.



















