మొదటి భాగం 4/25
అనుభవానంతరం వెంకట్రామన్ లోని మానవత్వం, దైవత్వంగా రూపొందింది. అతని వ్యక్తిత్వం, అద్భుతంగా పరిణామంచెందింది. పెనుతుఫాను తర్వాత ఏర్పడ్డ బ్రహ్మాండమైన నిశ్చలత్వంవలె, కొండల మధ్య రాజ్యమేలే నిశ్శబ్దం వలె, తీరానవున్న శిలల్నితాకి, శాంతించే సముద్ర తెరటంపలె వుంది, అతని విలీనం. విచ్చేదంకాని, విరామం కాని లేని, నిశ్చలత్వం ఏర్పడింది. అది, సమస్తాన్నితుడిచిపెట్టే నిశ్చలత్వం. అది మాయకు, భ్రాంతికి అతీతమైన స్థితి.ఆ స్థితిలోనే శాంతి, ఆనందం వుంటాయి. అటువంటి పరమోన్నతస్థితిలో నిలిచిపోయాడు, వెంకట్రామన్. అంటే, అసలు వున్నదానికి, చిద్వస్తువుకు “ఈశ్వరుడు – ఆత్మ – నేను” అనేవి వేరుకావనే ఎరుకే, జ్ఞానం. వెంకట్రామన్ పదిహేడవ ఏట ఆ జ్ఞానాన్నేపొందాడు.
ఆ క్షణం నుంచి వెంకట్రామన్ జీవన విధానం పూర్తిగామారిపోయింది. సమస్తాన్ని సహృదయంతో తనలోకి తీసుకుని,అవగాహన చేసుకుంటో, తనపై దృష్టి కేంద్రీకరించుకుంటూ, చదివేపాఠ్య పుస్తకాల్నీ, చుట్టూ వుండే బంధు మిత్ర జనాన్నీ, అన్నింటినీ నిరాకరిస్తో, తరచు ఒంటరిగా కూర్చుని, కళ్లుమూనుకుని నిశ్చలంగా, నిర్మలంగా ఉంటో అందరినీ ఆశ్చర్యచకితుల్నిచేశాడు.
ఆనాటి నుంచి అతనిలో ప్రత్యేక వ్యక్త్విపు స్ఫురణపోయింది. ప్రతిరోజు సాయంత్రం మీనాక్షి ఆలయానికి వెళ్ళి,గంటల తరబడి కూర్చునేవాడు. మహర్షుల, మహాత్ముల జీవితచరిత్రలు చదివేవాడు. తరచు అతని కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలుకారేవి. ఆత్మలోతుల్లో లీనమై, మౌనంగా వుండేవాడు. తింటూతిరుగుతూ, స్కూలుకు వెడుతున్నా, అతడు దేనిమీదా శ్రద్దా,ఆస క్తి م చూపేవాడుకాదు. ఆటలకు పోడు స్నేహితుల్ని కలవడు.ఆ విధంగా యాంత్రిక జీవనం సాగించాడు. క్రమంగా అతనికిదేనితోనూ, ఎవరితోనూ ఎటువంటి సంబంధం లేకుండా పోయింది.దేహం మిగిలింది. అందుచేత ప్రపంచాన్ని సినిమా చూస్తున్నట్లుచూసేవాడు. జరిగిపోతున్న సంగతులకు, సంఘటనలకు సాక్షిగావుంటూ, దేనికీ చలించకుండా వుండేవాడు. అతనిలో పాత అలవాట్లు పోయాయి. పాత విలువలు మారాయి. ఎవరితోనూమాట్లాడడు.అతనిలో వచ్చిన మార్పును ఇంట్లో వాళ్ళు గమనించారు.అప్పటి తన పరిస్థితిని భగవాన్ ఇట్లా చెప్పారు: “నాకు కలిగిన అనుభవ ఫలితంగా, నాలో కొత్త తరహా ఎరుక వచ్చిందని గుర్తించాను.బంధు మిత్రులతో వున్న సంబంధం, తెగిపోయింది. పెద్దవాళ్ళతృప్తి కోసం, అప్పుడప్పుడూ పుస్తకం తెరిచేవాడిని. కాని, దృష్టిఎక్కడో అతీత శక్తుల మీద నిలిచేది. ఇతరులయెడ నా సంబంధంసాధువుగా, అణకువగా, విధేయతగా వుండేది. నా ఉదాసీన భావంచూసి, మిత్రులు నన్ను పలకరించడం మానుకున్నారు. ఒక్క అరగంట కాలంలో, నాలో అంత మార్పు వచ్చింది.
“నా అహంభావం అదృశ్యమై పోవడంతో, ప్రతిదాన్నిప్రశాంతంగా జరుపుకుపోయేవాడిని. ఆటలు, వినోదాలు ఆగిపోయాయి. రోజులో చాలా సేపు ఒంటరిగా నాకు వీలైన ఆసనంలోధ్యానంలో కూర్చునేవాడిని. నన్ను నిర్మించి, నిలబెట్టిన శక్తితో ఏరమయ్యేవాడిని. ఆ కాలమంతా, ఆనందంగా గడిచేది. ఆ విధంగాఆ మహాశక్తితో ఐక్యం కాని సమయాల్లో, నా ఒళ్ళంతా జ్వరం వచ్చినట్లు వేడిగా వుండేది. ఆ తాపంతో, అశాంతిగా వుండేవాడిని.ఇంట్లోవాళ్ళు నన్ను నెమ్మదిగా మందలించడం ఆరంభించారు.ఒక్కోసారి నన్ను చివాట్లు కూడా వేసేవారు. నాలో వచ్చిన మార్పుఏమిటో వాళ్ళకు తెలియదు. “చదువు మీద ఇష్టం లేకపోతే అడవులోకి పోయి, తపస్సు చేసుకోరాదా?” అనేవాడు మా అన్న.అప్పుడప్పుడూ నన్ను “యోగి – ముని” అని పరిహాసం చేసేవాడు.“నాకు దీని మీదా, ముఖ్యంగా తిండి మీద ఇష్టాయిష్టాలుపోయాయి. ఏది పెడితే అది తినేవాడిని. మీనాక్షి గుడికి వెళ్ళి, దేవివిగ్రహం ముందు ఎంతో సేపు నిలబడి, “అమ్మా! నన్ను తీసుకో!’అని ప్రార్ధించేవాడిని. ఉద్రేక తరంగాలు, నన్ను ముంచేవి. దేహాత్మబుద్ధి వీడి, మరో పవిత్ర సంబంధంకోసం నా అంతరాత్మ గట్టిగావెదికేది. కన్నీరు ధారగా కాలేది. “ప్రభో, నన్ను కరుణించు.నన్నుతీసుకో’ అని ఈశ్వరుణ్ణి ప్రార్ధించేవాడిని. అంతే! నాకుఇంకేమీ తెలియదు. జీవితం దుఃఖమయమనీ తెలియదు. నాకుపునర్జన్మ వద్దనీ, ముక్తి కావాలనీ లేదు. కాని, అసలు ఏమిటో, ఏమీతెలియకుండానే దేనికోసమో ఆరాటం, ఆవేదన, ఆవేశం, పరితాపం. ఒళ్ళంతా దుర్బరంగా మంటలు. అప్పటికి నేను పెరియపురాణం తప్ప మరే గ్రంథం చదవలేదు. స్కూల్లో బైబిల్ ه చదివాను.కొంచెం తేవారాలు ” చదివాను. పురాణాల్లోని ఈశ్వరుడే, నాకుఈశ్వరుడు. పరబ్రహ్మ, సంసార బంధం వంటి మాటలు నేను వినలేదు. ‘సత్యం – శివం సుందరం’ అంటే ఏమిటో నాకు తెలియదు. తిరుపక్షామలై వచ్చాక, “రిబుగీత” విన్న తర్వాత, ఇతరగ్రంథాలు కూడా విన్న తర్వాత నేను ఏ అనుభూతి పొందానో,దాన్నే ఆ గ్రంథాలూ చెపుతున్నాయని తెలుసుకున్నాను. ఆ నాఅనుభవం, అది శుద్ధమనసు, లేక, జ్ఞానం. దాన్నే ప్రశాంతమైనఅంతరజ్ఞానమనీ, మేల్కోవడమనీ అంటారనీ తెలుసుకున్నాను.




















