వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) గురువారం పోలీసు విచారణకు హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం ఆయన శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవుల మరణాలపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ ఆరోపణల నేపథ్యంలో తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, భూమన చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలంటూ ఎస్వీయూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల మేరకు భూమన కరుణాకర్‌రెడ్డి ఈ రోజు విచారణకు హాజరైనట్లు సమాచారం.



















