గురువారం సాధారణ రోజే అయినా, ఈ వారం క్రికెట్ అభిమానులకైతే తీవ్ర ఉత్కంఠ నింపిన రోజు. ఎందుకంటే భారత పురుషులు, మహిళల జట్లు రెండు కీలకమైన మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నాయి. ఒకటి సిరీస్ పరంగా కీలకం, మరొకటి సెమీఫైనల్ అవకాశాలపై కీలకం.
పురుషుల వన్డే సిరీస్‌లో ‘జీల్లేదే’.. ఇప్పుడు మ్యాచ్ తప్పనిసరి!
ప్రస్తుతం భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్‌లో బరిలో ఉంది. పెర్త్‌లో జరిగిన మొదటి వన్డేలో ఓటమిని చవిచూసింది. దీంతో సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలంటే రెండో వన్డేలో విజయం అవసరం.
తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అవ్వగా, రోహిత్ శర్మ కేవలం 8 పరుగులతో వెనుదిరిగాడు. వీరి ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తడంతో, రెండో వన్డేలో ఎలా ఆడతారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. మరోవైపు రోహిత్‌ను యశస్వి జైస్వాల్‌తో రీప్లేస్ చేయనున్నారన్న వార్తలు స్పష్టత కలిగించకపోయినా, అతడి భవితవ్యం గురించి చర్చలు ఊపందుకున్నాయి.
భారత్ అంచనా తుది జట్టు:
రోహిత్ శర్మ/యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్/కుల్‌దీప్ యాదవ్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
మహిళల వరల్డ్ కప్‌లో కీలక పోరుకు రెడీ.. సెమీస్ రేసులో న్యూజిలాండ్‌తో తలాపడి!
ఇక భారత మహిళల జట్టు టి20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ అవకాశాల కోసం కీలకమైన పోరులోకి దిగబోతోంది. గురువారం న్యూజిలాండ్‌తో తలపడే మ్యాచ్‌లో గెలిస్తే, సెమీస్‌కు బలమైన అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్, శ్రీలంక— 4 పాయింట్లతో నలుగురి బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఇప్పటికే టోర్నీ నుంచి వెళిపోయాయి.
ఇక్కడ ఓడిపోతే టోర్నమెంట్ నుంచే నిష్క్రమించే పరిస్థితి ఏర్పడుతుంది. గెలిస్తే మాత్రం, చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించడం పెద్ద సమస్య కాదు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా చివరి మ్యాచ్ గెలిస్తే భారత్‌కు ఛాన్స్ ఉంటుంది.
భారత అంచనా తుది జట్టు:
ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్




















