రాజయ్యపేట: త్వరలోనే వైఎస్ జగన్ రాజయ్యపేటకు రానున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాలను తీసే విధంగా వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఎన్నికలకు ముందు అనిత చేసిన హామీలను గుర్తు చేస్తూ, “ప్రజలకు మేలు చేస్తానని చెప్పిన వారు ఇప్పుడు నిష్క్రియంగా ఉన్నారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన కూటమి నేతలకు తప్పక శిక్ష పడుతుంది” అని బొత్స స్పష్టం చేశారు.
మత్స్యకారుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన, వైఎస్‌ఆర్‌సీపీ మత్స్యకారుల పక్షాన నిలిచి, వారి హక్కుల కోసం బలమైన పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.
“మానవత్వం లేని ఈ కూటమి పాలనను ప్రజలు తప్పక తీర్పు చెబుతారు” అని బొత్స సత్యనారాయణ అన్నారు.




















