అస్సాంలోని బోడో తెగ ప్రజలు ఇంటిని నిర్మించే ముందు అందుకోసం ఎంపికచేసిన స్థలంలో బ్రహ్మజెముడు మొక్క నాటుతారు. అది మొగ్గ తొడిగినచోటే ఇల్లు కడతారు. వెదురుతో వీరు నిర్మించే ప్రతి ఇంటి ప్రాంగణంలో ఈ మొక్క ఉంటుంది. ఇప్పటికీ ఉమ్మడికుటుంబ వ్యవస్థను అనుసరిస్తున్న వీరు ఇంటి నిర్మాణం కోసం పెద్ద స్థలాన్ని ఎంపిక చేస్తారు. అందులో ప్రతి గదిని ప్రత్యేకమైన ఇంటిలా వేర్వేరుగా నిర్మిస్తారు. ధాన్యం నిల్వ చేసే గది (భక్రి)ని ఎలుకల బెడద ఉండొద్దని భూమికి రెండు అడుగుల ఎత్తులో నిర్మిస్తారు.




















