తిరుపతి నగర పాలక కౌన్సిల్ సమావేశంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కౌన్సిల్‌లో కార్పొరేటర్ గణేష్పై కూటమి గూండాలు దాడి చేసి అతన్ని నెట్టేశారు. ఈ ఘటనతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
బయటి వ్యక్తులు కౌన్సిల్ లోకి రావడం గురించి ఎంపీ గురుమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడికి ప్రతికూలంగా, కార్పొరేటర్ గణేష్ కౌన్సిల్‌లో కింద కూర్చొని నిరసన తెలిపారు. దీంతో పరిస్తితిని సర్దడానికి జనసేన కార్పొరేటర్ ఎస్.కే. బాబు క్షమాపణ తెలిపారు.
సభా నిర్వహణపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఈ సంఘటనకు కారణమైందని అధికారులు వ్యాఖ్యానించారు.



















