తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. గెస్ట్ హౌస్ సమీపంలో ఒక కుక్కపై దాడి చేసి చంపిన ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటనతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశ్వవిద్యాలయ అధికారులు, అటవీశాఖ సిబ్బంది తక్షణమే స్పందించి ఆ ప్రాంతంలో చిరుత జాడ కోసం కెమెరా ట్రాప్లు, మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు మరియు సిబ్బందిని రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించవద్దని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అటవీ అధికారుల సమాచారం ప్రకారం, సమీప అటవీ ప్రాంతాల నుండి ఆహారం కోసం చిరుతలు అప్పుడప్పుడు పట్టణ పరిసరాలకీ చేరుతున్నాయని తెలిపారు.
విశ్వవిద్యాలయ పరిసరాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.




















