సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 14వ ఎస్ఐపీబీ సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో కీలక పెట్టుబడులకు ఆమోదం లభించింది. 2025లో టీమ్ వర్క్ వల్లే పెట్టుబడుల్లో మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్న సీఎం, 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని మంత్రులు, అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇవ్వగా, 11,753 ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. ఇప్పటివరకు మొత్తం రూ.8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించి, 8.35 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు వెల్లడించారు.విద్యుత్ రంగంలో ఛార్జీలు తగ్గించడం, ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం భరించడం వల్లే డేటా సెంటర్లు, భారీ పెట్టుబడులు వచ్చాయని సీఎం తెలిపారు. టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఐలాండ్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఏపీ ఐటీ ఇన్ఫ్రా పోర్టల్‌ను ప్రారంభించారు.



















