ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (DG EME) తాజాగా 69 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (JTTI), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II, మల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), వాషర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య వివరాలు
- మొత్తం పోస్టులు: 69
- జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ – 2
- స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-2) – 2
- మల్టీటాస్కింగ్ స్టాఫ్ – 37
- లోయర్ డివిజన్ క్లర్క్ – 25
- వాషర్‌మెన్ – 3
ఎంపిక విధానం
అభ్యర్థులను రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష ఓఎంఆర్ విధానంలో ఉంటుంది.
- మొత్తం మార్కులు: 150
- పరీక్ష భాషలు: ఇంగ్లిష్, హిందీ
- వ్యవధి: 2 గంటలు
- నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గింపు
జేటీటీఐ, ఎల్‌డీసీ పరీక్ష ప్యాటర్న్:
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ – 25 ప్రశ్నలు
- జనరల్ అవేర్‌నెస్ – 25 ప్రశ్నలు
- జనరల్ ఇంగ్లిష్ – 50 ప్రశ్నలు
- న్యూమరికల్ ఆప్టిట్యూడ్ – 50 ప్రశ్నలు
ఎంటీఎస్ పరీక్ష ప్యాటర్న్:
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ – 50 ప్రశ్నలు
- జనరల్ అవేర్‌నెస్ – 50 ప్రశ్నలు
- జనరల్ ఇంగ్లిష్ – 25 ప్రశ్నలు
- న్యూమరికల్ ఆప్టిట్యూడ్ – 25 ప్రశ్నలు
సన్నద్ధత సూచనలు
- పాత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది.
- మాక్ టెస్టులు రాస్తూ సమయ నిర్వహణ నేర్చుకోవాలి.
- బలహీనమైన అంశాలపై ఎక్కువ సమయం కేటాయించాలి.
అర్హతలు
- JTTI: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో B.Sc., ఎడ్యుకేషన్‌లో డిగ్రీ/డిప్లొమా, 2 సంవత్సరాల బోధనా అనుభవం.
- LDC: ఇంటర్మీడియట్ విద్యార్హత, కంప్యూటర్ టైపింగ్ వేగం ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు.
- MTS: పదో తరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, ఒక సంవత్సరం అనుభవం.
వయసు పరిమితి
- JTTI: 21 – 30 సంవత్సరాలు
- LDC, MTS: 18 – 25 సంవత్సరాలు
- రిలాక్సేషన్: SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు, దివ్యాంగులు – 10 నుండి 15 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
- దరఖాస్తు ఫీజు లేదు.
- అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ప్రింట్ తీసుకుని పూర్తి చేయాలి.
- కవర్‌పై దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరు స్పష్టంగా రాయాలి.
- సంబంధిత ధ్రువపత్రాల ప్రతులను జతచేసి “The Commandant, 1 EME Centre, Secunderabad – 500087” చిరునామాకు ఆర్డినరీ పోస్టు ద్వారా పంపాలి.
ముఖ్య తేదీలు
- దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 14, 2025
- పరీక్ష కేంద్రం: 3 ట్రైనింగ్ బెటాలియన్, 1 EME సెంటర్, సికింద్రాబాద్
అధికారిక వెబ్‌సైట్:

















