ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. ప్రాజెక్టు హెలిపాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు.ఇందుకు ముందు ఏరియల్ విజిట్ ద్వారా పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి స్పిల్‌వే సహా మొత్తం ప్రాజెక్టును వీక్షించారు. డయాఫ్రమ్ వాల్‌తో పాటు ఇతర కీలక నిర్మాణాలను దగ్గరుండి పరిశీలించి, పనుల స్థితిగతులపై అధికారులతో చర్చించారు.



















