నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజత్ చంద్రకాంత్ సేత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య విద్య, ఆరోగ్య సేవల అభివృద్ధిపై ఇరువురు స్నేహపూర్వకంగా చర్చించారు.ఈ భేటీలో డాక్టర్ ఎన్‌టిఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు.



















