కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధం అయిన ఈ ఘటనలో పలువురు వ్యక్తులు మృతి చెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
దుబాయ్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాదాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఘటన వివరాలను తెలుసుకోవడానికి ఆయన సీఎస్ సహా ఇతర అధికారులు తో మాట్లాడారు.
ముఖ్యమంత్రి అవసరమైన ఆదేశాలు జారీ చేసి, ఉన్నత స్థాయి యంత్రాంగం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని, క్షతగాత్రులు మరియు బాధితులకు తక్షణ సహకారం అందించాల్సిందిగా సూచించారు. అంతేకాక, మరిన్ని ప్రాణనష్టాలు నివారించడానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సీఎం ఆదేశించారు.



















