తిరుపతి: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విచారణ తిరుపతి ఎస్వీయూ పోలీస్‌స్టేషన్‌లో ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు భూమన కరుణాకరరెడ్డిని పోలీసులు సవివరంగా ప్రశ్నించారు. ఈ విచారణ తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలనాయుడు ఆధ్వర్యంలో కొనసాగింది.
శ్రీ వెంకటేశ్వర గోసంక్షరణ శాలలో గోవుల మృతిపై భూమన కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని, విచారణకు హాజరు కావాలని ముందుగా నోటీసులు పంపినట్లు సమాచారం.
ఈ కేసు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గోశాలలో జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.




















