ఒడిశాకు చెందిన పాయల్ నాగ్ అసాధారణమైన పట్టుదలతో తనకంటూ ప్రత్యేక చరిత్రను లిఖించారు. ఐదేళ్ల వయసులో విద్యుత్ ఘాతంతో చేతులు, కాళ్లు కోల్పోయినా, జీవితాన్ని ఆగిపోనివ్వలేదు. అనాథాశ్రమంలో పెరిగినా, తనలోని ఆత్మవిశ్వాసంతో ఆర్చరీ (విలువిద్య)ను తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు.భుజం మరియు నోటి సాయంతో విల్లును ఎక్కుపెట్టి సాధన చేస్తూ, జాతీయ స్థాయి ఛాంపియన్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రపంచంలోనే అవయవాలు లేకుండా ఆర్చరీలో పోటీపడిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన పాయల్ నాగ్, వైకల్యం శరీరానికే పరిమితమని, కానీ ఆశయాలకు కాదు అనే సందేశాన్ని బలంగా చాటారు.ఆమె సాధించిన విజయాలకు యావత్ దేశం గర్వంతో సెల్యూట్ చేస్తోంది. పాయల్ నాగ్ కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే జీవంత ఉదాహరణగా నిలుస్తోంది.



















