అమెరికా వెలుపల భారీ పెట్టుబడిగా గూగుల్ విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర జీడీపీ ఏటా ₹11,000 కోట్లు పెరగనుందని చెప్పారు. మరోవైపు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సెంటర్ రాష్ట్రానికి ₹10,000 కోట్లకుపైగా ఆదాయం తెస్తుందని పేర్కొంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ ప్రాజెక్ట్‌ను ఉత్తరాంధ్రకు చారిత్రక ఘట్టంగా పేర్కొంటూ, లోకేశ్ కృషితో విశాఖ ఏఐ మరియు ఐటీ హబ్‌గా మారుతోందని అన్నారు. ఏపీని డిజిటల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్ట్ పెద్ద ముందడుగని నేతలు అభిప్రాయపడ్డారు.




















