ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీతో కలిసి ఎర్రకోట సమీపంలో కారు పేలుడు కుట్రలో పాల్పడ్డ నిందితుడిగా అమీర్ రషీద్ అలీని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్‌లోని సంబూర్ నివాసి రషీద్ అలీ, దిల్లీలో కారు కొనుగోలు చేసి, దానిలో పేలుడు పదార్థాలు అమర్చడం, తరువాత కారు పేల్చడంలో ప్రధాన పాత్ర పోషించాడని ఎన్‌ఐఏ వెల్లడించింది.
అంతేకాకుండా, ఎర్రకోట పేలుడు కేసులో నిందితులపై దర్యాప్తు చేస్తున్న బృందాలు హరియాణా రాష్ట్రానికి చెందిన వైద్యురాలు ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నాయి. అనంత్‌నాగ్‌లో ఆమె నివాసంలో సోదాలు చేసినట్లు తెలిపారు. ప్రియాంకకు నిషేధిత ఉగ్ర సంస్థలైన జైషే మహమ్మద్, అన్సార్ గజ్‌వత్ ఉల్ హింద్‌కు చెందిన అదీల్ అహ్మద్‌తో పరిచయం ఉందని పోలీసులు భావిస్తున్నారు.



















