బిహార్ బాహుబలి నేత అనంత్ కుమార్ సింగ్ ప్రస్తుతం మర్డర్ కేసులో జైల్లో ఉన్నప్పటికీ, మొకామా నుంచి అత్యధిక మెజార్టీతో ఎన్నికల్లో విజయం సాధించారు.
ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి రికార్డులు సృష్టిస్తూ, ప్రత్యర్థి కూటమిని బలహీన పరిస్తితికి చేరుస్తూ 202 సీట్లను గెలిచింది. మహా ఘట్ బంధన్ కూటమి కేవలం 35 సీట్లకు పరిమితం అయింది. అందులో కాంగ్రెస్ 6 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించింది, జేడీయూ 85 సీట్లను గెలుచుకుంది. ముఖ్యంగా, ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసిన అభ్యర్ధులు బలమైన మెజార్టీతో గెలిచినట్లు ప్రత్యేక గుర్తింపు పొందారు.
మొక్కామా పరిధిలో జేడీయూ నుంచి బాహుబలి నేత అనంత్ సింగ్, ఆర్జేడీ నుంచి మహిళా అభ్యర్ధి వీనా దేవి మధ్య పోటీ జరిగింది. అనంత్ సింగ్ 91,000 ఓట్లను సాధించి, వీనా దేవి కేవలం 63,000 ఓట్లు మాత్రమే సాధించగా, 28,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
అంతేకాక, అనంత్ కుమార్ సింగ్‌పై ఇప్పటి వరకు 28 క్రిమినల్ కేసులు నమోదు కాగా, 2022లో అక్రమ ఆయుధాల కేసు కారణంగా అసెంబ్లీ మెంబర్‌షిప్‌ను కోల్పోయారు. నవంబర్ 2వ తేదీన ‘దులర్ సింగ్ యాదవ్’ అనే రాజకీయ నాయకుని మర్డర్ కేసులో అరెస్ట్ అయిన అనంత్, ఈ కేసు కారణంగా జైల్లో ఉన్నా కూడా, ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం విశేషం.




















