- గాయత్రిదేవి చేతిలోని కపాలం పేరు బ్రహ్మకపాలం.
- కలిపురుషుడు అడుగిడలేని ప్రదేశం నైమిశారణ్యం.
- అగ్నిదేవుడి పేరు వైశ్వానరుడు. పరమేశ్వర అనుగ్రహము వలన ఆగ్నేయ దిక్పాలకుడై అగ్ని అయినాడు.
- శనివారం తప్ప ఇతర వారములలో రావిచెట్టును తాకరాదు.
- కదంబ వృక్షము శ్రీదేవి స్వరూపము. మేడిచెట్టు దక్షిణామూర్తి స్వరూపము.
- గండకీనది ఒడ్డున లభించే శిలలే సాలగ్రామ శిలలు. విష్ణుమూర్తికి ప్రతిరూపాలు.
- గ్రహణ సమయమున సంభోగం మిక్కిలి దోషం.
- పూజ చేసే సమయంలో మంచి కుంకుమనే ధరించాలి. (బొట్టుబిళ్ళలు పనికిరావు)
- దుర్గాదేవిని గరికతో, తులసీదళాలలో పూజించరాదు. అమ్మవారి పూజకు బంతిపూలు నిషిద్ధం.
- నందీశ్వరుని తండ్రిపేరు శిలాధ మహర్షి.
- లక్ష్మీతామర పూలు పూజకు సర్వశ్రేష్ఠం. (అందరు దేవతలకు)
- తెల్లని పూలతో పూజించడం వలన మనఃశ్శాంతి కలుగుతుంది.
- ఆసనములలో సర్వశ్రేష్ఠమైనది దర్భాసనము.
- గృహస్తుడు, పతివ్రతా సదా తాంబూల చర్వణం చేయాలి.
- బియ్యం పిండితోనే ముగ్గువేయాలి. (రాతి ముగ్గు వాడరాదు)
- అగరువత్తులు వెలిగించి దేవుడి చుట్టూ తిప్పకూడదు. ధూపం మాత్రం చేతితో చూపించాలి.
- ప్రదక్షిణ చేయునపుడు చాలా నిదానముగా అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణం చేయవలెను.
- రావణబ్రహ్మ అసలు పేరు పొలశ్య బ్రహ్మ. రావణ బిరుదము ఇచ్చినది శివుడు
- శివుడి త్రిశూలం పేరు విజయం. శివుడి ధనస్సు పేరు పినాకము.
- పార్వతీ అమ్మవారి ముఖ్య పరిచారికల పేర్లు జయ, విజయ
- పార్వతీ దేవికి గల మరో పేరు అపరాజిత (ఓటమి లేని అని అర్థం)
- పార్వతీదేవి అమ్మవారి నక్షత్రము ఆరుద్ర నక్షత్రము.
- దుర్యోధనుడు, జరాసందుడు, కీచకుడు, బకాసురుడు, భీమసేనుడు జన్మించినది మూలా నక్షత్రంలో
- శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జన్మలగ్నం కర్కాటకలగ్నం ఆరుద్ర నక్షత్రం.
- శ్రీ రామచంద్రస్వామి వారు పునర్వసు నక్షత్రంలో కర్కాటకలగ్నం కర్కాటక రాశిలో జన్మించారు.
- శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వక్షస్థలములో నివాసమున్నది కలియుగ లక్ష్మి
- శ్రీ వేంకటేశ్వరస్వామివారు కుబేరుని వద్ద చేసిన అప్పు పద్నాలుగు లక్షలు రామనిష్కముద్రలు.
- నారద మహర్షి వీణ పేరు మహతి. శ్రీకృష్ణ పరమాత్మకు నీడనిచ్చినది కదంబ వృక్షం.
- భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు.
- వాల్మీకి మహర్షి పూర్వనామం రత్నాకరుడు. దుర్గాదేవి చేతిలోని కపాలం పేరు విశ్వభక్షణం.
- బ్రహ్మవిష్ణువులకు జ్ఞాన బోధ చేయడానికి పరమేశ్వరుడు అగ్నిస్తంభంగా అవతరించిన ప్రదేశమే అరుణాచలం.
- రామాయణంలో ఏడుకాండలు ఐదువందల సర్గలు, ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి.
- మహనీయుల్ని అనుసరించాలి అనుకరించకూడదు.
- ఎక్కువమందికి జాతకాలు చూపించడం వల్ల ఎక్కువ కష్టాలు వినాల్సి వస్తుంది.
- ఎంతో అవసరం అయితేనే జాతకాలు పరిశీలనకు ఇవ్వాలి.
- పెద్ద సిద్ధాంతులు, చిన్న సిద్ధాంతులు, లేరు. అందరూ విద్యార్థులే. పెద్ద సిద్ధాంతి పరమేశ్వరుడు ఒక్కడే.



















