ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఈనెల 23వ తేదీన అమరావతిలోని హైకోర్టు వద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరిగే ఈ రక్త దాన కార్యక్రమంలో ఆరోగ్యవంతులైన యువత, ఉద్యోగులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి మానవతా సేవలో భాగస్వాములు అవ్వండి. రక్తం అత్యవసరంగా అవసరమైన రోగులకు తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.


















