కొండపల్లికి చెందిన ఒక పొదుపు సంఘం ప్రతి నెలా బ్యాంకులో డబ్బు జమ చేయడానికి వాయిదా నగదుతో వెళ్తే, ఆ నోట్లలో రెండు నకిలీ 500 రూపాయల నోట్లు బయటపడ్డాయి. బ్యాంకు సిబ్బంది వాటిని తిరస్కరించారు, కానీ ఎవరు వాటిని ఇచ్చారో సంఘ సభ్యులకు అర్థం కాలేదు.
ఇబ్రహీంపట్నం కూడలిలో రద్దీగా ఉండే ఓ హోటల్‌లో యజమాని రాత్రి కలెక్షన్‌ను తనిఖీ చేస్తే, మూడు నకిలీ 500 రూపాయల నోట్లు బయటపడ్డాయి. కౌంటర్ సిబ్బందిని అడిగినా ఎవరూ మాట్లాడకపోవడంతో, యజమాని వాటిని భరించాల్సి వచ్చింది.
పాల బిల్లులలో కూడా సూపర్‌వైజర్ వద్ద రెండు నకిలీ 500 రూపాయల నోట్లు వచ్చాయి. నగదు అప్పగించే సమయంలో గుర్తించగా, అది ఎవరి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. ఇలా ప్రజలు నకిలీ నోట్లకు సులభంగా పడి కష్టాల్లో పడుతున్నారు.
గమనిక – నకిలీ నోట్లను గుర్తించడానికి సూచనలు (ఆర్‌బీఐ ద్వారా):
- నోట్ పొడవు – 63 మిమీ, వెడల్పు – 150 మిమీ
- దేవనాగరి భాషలో “భారత్”, “ఇండియా” చిన్న అక్షరాలతో ముద్రించబడినవి
- సెక్యూరిటీ త్రెడ్‌పై బులుగు మరియు పచ్చ రంగులో “RBI” మరియు “భారత్” ముద్రలు
- కుడివైపు భాగంలో గవర్నర్ సంతకం; నోట్ పై, కిందనుండి నంబర్ సూచనలు
- కుడి దిగువభాగంలో 500 చిహ్నం గమనించాలి
- ఎడమ వైపు అశోక స్తంభం ఎంబ్లమ్ గమనించాలి
- “స్వచ్ఛ భారత్” లోగో, నినాదం ఉండాలి
- నోట్ మధ్యలో మహాత్మా గాంధీ సింబల్‌ను కచ్చితంగా పరిశీలించాలి ఈ లక్షణాలు లేకపోతే, ఆ నోట్ ఖచ్చితంగా నకిలీ అని గుర్తించవచ్చు.



















