ఇంటర్నెట్ డెస్క్: మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ స్థానం ఖరారైంది. టైటిల్ కోసం టీమ్ ఇండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఫైనల్ టికెట్లు అమ్మకానికి అందుబాటులో లేకపోవడం అభిమానుల్లో ఆగ్రహం రేపింది. ‘‘ఇంత పెద్ద మ్యాచ్‌కి ముందే టికెట్ సేల్స్ మొదలవ్వాలి కదా? ఇంతవరకు టికెట్లు రిలీజ్ చేయకపోవడం ఎలా?’’ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.



















