డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు, 42 మంది మృతి..
మక్కా నుంచి మదీనాకు వెళ్లిన భారతీయ యాత్రికులు…
బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు..
మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు..
మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులుగా గుర్తింపు…!
సౌదీ ఆరేబియా బస్సు ప్రమాదంలో మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తింపు – మల్లేపల్లిలోని ఆల్‍మీనా ట్రావెల్స్ నుంచి 16 మంది,.. మెహదీపట్నంలోని ఫ్లైజోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్స్ బుకింగ్ – మరో ఇద్దరు మరో ఏజెన్సీ ద్వారా మక్కా వెళ్లినట్లు గుర్తింపు – మల్లేపల్లి బజార్ ఘాట్ నుంచి యాత్రకు వెళ్లిన 16 మంది – ప్రమాద విషయం తెలిసి ట్రావెల్ ఏజెన్సీని చేరుకుంటున్న బంధువులు
సౌదీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి – ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీకి ఆదేశం – కేంద్రం, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించిన రేవంత్ – బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశం – ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగశాఖ అధికారులతో మాట్లాడిన సీఎస్ – హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు – కంట్రోల్ రూం నెంబర్లు : 79979 59754, 99129 19545



















