నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం అధికంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 26 గేట్లను ఎత్తి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లోకి 2.70 లక్షల క్యూసెక్కుల వరదజలాలు చేరుతున్నాయి. అదే పరిమాణంలో నీటిని ఔట్‌ఫ్లో ద్వారా బయటకు విడుస్తున్నారు.
కుడి కాల్వ ద్వారా 10,040 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,193 క్యూసెక్కులు, పవర్ హౌస్‌కు 33,291 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. స్పిల్‌వే గేట్ల ద్వారా మాత్రమే 2.16 లక్షల క్యూసెక్కులు వెలువడుతున్నాయి.
జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587.30 అడుగులుగా ఉంది. అలాగే పూర్తి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నిల్వ 305.68 టీఎంసీలుగా నమోదైంది.


















