అడుగుపెట్టడం అంటే ఎన్నో సామాజిక సవాళ్లను, విమర్శలను ఎదుర్కోవడమేనని షేక్ హాఫీజున్ తన అనుభవంతో చెప్పారు. M.Sc, B.Ed లాంటి ఉన్నత విద్య అభ్యసించిన ఆమెకు, పెళ్లి తర్వాత ‘నువ్వు కేవలం టీచర్ ఉద్యోగానికి తప్ప మరెందుకూ పనికిరావు’ అన్న మాటలు ఎదురయ్యాయి. కానీ, ఆ విమర్శలనే తన విజయానికి మెట్లుగా మార్చుకున్నారామె. తన భర్త మరియు తల్లిదండ్రుల అండతో, 28 ఏళ్ల వయసులో అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ పట్టుదలతో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించారు. కేవలం చదువు చెప్పించి పెళ్లి చేయడమే కాకుండా, ఆడపిల్లలు తమకు ఇష్టమైన రంగంలో స్థిరపడేలా తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించాలని ఆమె పిలుపునిచ్చారు. ఆమె ప్రసంగం వింటుంటే నిజంగానే కళ్లు చెమ్మగిల్లుతాయి.”



















