తిరుమలలో నిరంతర వర్షాల కారణంగా గోగర్భం జలాశయం పూర్తిస్థాయిలో నిండిపోయింది. జలాశయం మొత్తం సామర్థ్యం 2894 అడుగులు కాగా, వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో జలస్థాయిని నియంత్రించేందుకు టీటీడీ అధికారులు అర్థరాత్రి ఒక గేటును ఎత్తివేసి నీటిని విడుదల చేశారు. భద్రతా చర్యల భాగంగా జలాశయం పరిసర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.



















