హైదరాబాద్: బంగారం ధరల్లో ఈ రోజు భారీ తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.1,28,150కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,17,500గా నమోదు అయ్యింది. కిలో వెండి ధర కూడా రూ.1,65,000కు చేరింది. మంగళవారం ధరలతో పోలిస్తే, 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.6,000 తగ్గినట్లు బులియన్ మార్కెట్ లో నమోదైంది.
బంగారం, వెండి ధరల్లో ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా, ఇటీవల రికార్డు స్థాయిలకు చేరిన ధరలపై మదుపర్లు లాభాల కోసం విక్రయాలు ప్రారంభించడం, అమెరికా డాలర్ బలోపేతం, అంతర్జాతీయ ఉద్రిక్తతల్లో కొంత ఉపశమనమవడం వంటి అంశాలను బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు.


















